ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. సీఎం జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు.
ఈ క్రమంలోనే మరికొందరు నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు. కోడూరు వైసీపీ ముఖ్యనేత కమలాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరనున్నారు.