ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజానీకానికి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంటుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకుని స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43 మంది ఎమ్మెల్యేల మెజారిటీని సవాలు చేస్తున్నారంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.