వరుసగా ఐదో విడత రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేశంలో బీమా ప్రీమియం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.
అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం పెంచాం. రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు చెల్లించాం. మొత్తం 53.58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.’ అని అన్నారు.