అధికార వైసీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు 64 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 34 నియోజకవర్గాల్లో కొత్తవాళ్లకు అవకాశమిచ్చారు.
29 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 20 చోట్ల కొత్త వారికి టికెట్ కేటాయించారు. 30 మంది సిట్టింగ్‌లను పక్కపెట్టింది. అలాగే 16 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది.