ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ల కేవైసీ పూర్తి చేయాలని వాహనదారులకు సూచించింది.
ఇందుకు జనవరి 31ని తొలుత గడువు తేదీగా నిర్ణయించింది. తర్వాత దాన్ని ఫిబ్రవరి 29కి పొడిగించింది. రేపటితో ఈ గడువు ముగియనుంది. మరోసారి దీన్ని పొడిగించేందుకు సుముఖంగా లేదని సమాచారం.