గుంటూరు జిల్లాలోని వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రెండెకరాలకే అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు న్యాయవాదిని కోరింది. ఆయన కాలం సరిపోదని అనటంతో ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని వ్యాఖ్యనించింది.