ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో 120 కుటుంబాలు బుధవారం టిడిపిని వీడి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. 120 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరడం పట్ల ఇన్ చార్జ్ నాగార్జున రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వైసిపికి గిద్దలూరు నియోజకవర్గం కంచుకోట అని నాగార్జున రెడ్డి అన్నారు.