కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ బుధవారం రాత్రి భేటి అయ్యారు. కందుకూరు వైసీపీ టికెట్ మహీధర్ రెడ్డికి బదులు బుర్రా మధుసూదన్ కు అధిష్టానం ప్రకటించింది. బుర్ర మధుసూదన్ తన అనుచరులతో కలిసి మహీధర్ రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం మాచవరంలో భేటి అయి దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. దీంతో బుర్ర మహీధర్ రెడ్డి సపోర్ట్ అడిగినట్లు తెలుస్తుంది.