ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 18వ వార్డులో బుధవారం టిడిపి ఇన్ ఛార్జ్ ముతుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపికే ఓటు వేసి గెలిపించాలని టిడిపి ఇన్ ఛార్జ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.