బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పులివెందులలో రంగనాథ స్వామి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్ర త్యేక పూజలు చేశారు. రథంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహా లను ఆసీనులను చేశశరు. ఉద యం నుంచి భక్తులు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రథాన్ని కదిలించారు. అక్కడి నుం చి పాతగంగిరెడ్డి ఆసుపత్రి, ము త్యాలవారివీధి, మసీదు వీధి, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూలంగళ్ల సర్కిల్ వరకు రథోత్సవం సాగింది. భక్తుల గోవింద నామస్మరణలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. పెద్దఎత్తున భక్తులకు అన్నదానం చేశారు. చెక్కభజనలు అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.