రాను న్న ఎన్నికల్లో పీలేరు నియోజక వర్గం నుంచి నల్లారి కిశోర్‌కు మార్రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపడమే కాకుండా ఉమ్మడి టీడీపీ-జనసేన జెండాను ఎగరే స్తామని మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. బుధ వారం పట్టణంలోని నాయక్వీధి, రైల్వే గేటు రోడ్డు, ఎల్ఆర్వీధి తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోతో రూపొందించిన కరపత్రాలను నాయకులు, కార్యకర్తలు ఇంటింటా పంచుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. వచ్చేది టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ వల్లిగట్ల వెంకటరమణ, పీలేరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లంకిపల్లి మధు, జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, టీడీపీ పీలేరు మైనార్టీ అధ్యక్షులు సయ్యద్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రమేష్ నాయకులు పీవీ నారా యణ, చంద్రమౌళి, తెలుగు యువత చాను, సయ్యద్బా షా, అడ్వకేట్ రమణ, స్వర్ణల త, ఎండీ యూసుఫ్, కువైట్ బాబు, బొక్కసం బ్రదర్స్, సాదిక్, సర్దార్, సయ్యద్ అమీర్, ఆలీ, సైదు, హనీఫ్, తోటవీధి ఫణి, బాలకృష్ణమనాయుడు, లోకేష్, నవీన, ప్రసాద్, అరుణ్, సంతోష్, తరుణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.