టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.