టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్, ఈవో ఎవి. ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతి రోజూ లక్ష మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారన్నారు.