మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పల్లెలు శిథిలమై పోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనం అయిపోతారని రాష్ట్ర పంచాయతీ రాజ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద సర్పంచులు నిరసన చేపట్టారు. ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్న 16 సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అనంతరం కలెక్టర్ కు అందజేశారు.