ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజూరోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో గత వారం రోజులుగా వేడి తీవ్రత అధికంగా ఉంది. కర్నూలులో ఏకంగా 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపింది.