తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకానికి కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చివేసిందని పులివెందుల టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. ఎంతో ప్రశాంతగా ఉండే నియోజకవర్గంలో అరాచకాలు, విధ్వంసాలు, దోపిడీలు, భూకబ్జాలు, మత్తు పదార్థాలకు నిలయంగా మారిపోయిందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ప్రవేశపెట్టారని ఆయన ధ్వజమెత్తారు.