బాపట్ల శ్రీ భావనారాయణ స్వామి ఆలయానికి రాష్ట్ర పర్యాటక శాఖ గుర్తింపు లభించడం హర్షణీయమని చరిత్ర పరిశోధకులు, బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తిమ్మన శ్యామ్ సుందర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా తొలి దశలోనే బాపట్ల ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లభించడంతో బాపట్ల ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లయిందని వివరించారు.