తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి స్వర దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 57,338 మంది దర్శించుకున్నారు.
19,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.