అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానంటూ హడావుడి చేసిన నాగబాబు స్పీడుకు జనసేన అధినేత, తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్రేకులు వేశారు.
పార్టీలో పదేళ్ల నుంచి పని చేస్తున్న నాయకులను పక్కనపెట్టి కొత్తగా చేరిన సుందరపు సతీష్ తదితరులను వెంటవేసుకుని నాగబాబు అనకాపల్లి పరిధి నిర్వహించిన సమీక్షలు బెడిసికొట్టాయి. నాగబాబు కారణంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గించమని చెప్పినట్లు సమాచారం.