ఏపీలో మహిళలకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్సార్ చేయూత పథకం నిధుల విడుదలపై స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నెలలోనే డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా..
కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. మార్చి 7న అనకాపల్లిలో సీఎం జగన్ బటన్ నొప్పి నిధులు విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున డబ్బులు జమ చేయనున్నారు.