మయన్మార్ నీళ్లలో నివసించే ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం పొడవు అర అంగుళం. అంటే మనిషి గోరు అంత ఉంటుంది. కొలతల్లో చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు.
ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందేనట. వాటి పక్క టెముకల్లో ధ్వనిని సృష్టించే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. దాంతో 140 డిసెబుల్స్‌కిపైగా శబ్ధాలు చేయగలవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇవి నీళ్లలో ఒకదానితో ఒకటి సంభాషించడానికి ఈ విధమైన శబ్దాలు చేస్తుంటాయట.