సరైన ఆధారాలు లేకుండా భార్య ఆత్మహత్యకు పాల్పడిన కేసులో భర్తను దోషిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. 30 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది.
"పెళ్లయిన 7 ఏళ్ళలోపు వివాహిత ఆత్మహత్యకు పాల్పడితే దానికి భర్త, అతని కుటుంబ సభ్యులు బాధ్యులుగా పరిగణించాలని సెక్షన్ 113ఎ చెబుతోంది. అలాగే ఆధారాలు లేకుండా భర్త నిందితుడని ఎలా చెప్పగలం?' అని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.