సూర్యుడు పడమరన ఉదయించినా సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై ఆయన జోస్యం చెప్పారు.
ఆయన మాట్లాడుతూ.. మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరన్నారు. చంద్రబాబు, పవన్ వంటి వాళ్లు ఎంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ను అధికారం నుంచి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవన్నారు.