ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు. జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేడీ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్‌కు జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.