ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ కి చంద్రబాబు లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 07:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్ఆర్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలిపారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీఎస్ఆర్డీఆర్ఐను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. "అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా ఏపీఎస్ఆర్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్ఆర్డీఆర్ఐ పనా?.. ఏపీఎస్ఆర్డీఆర్ఐ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేసింది?" అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com