ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పర్యటన పలువురు మహిళల్లో అసహనాన్ని రేకెత్తించింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు2023 త్రైమాసికానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఈరోజు (శుక్రవారం) పామర్రులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే సీఎం పామర్రుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సభాస్థలికి వచ్చారు. అయితే జగన్ రావడానికి ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సభా వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న మహిళలు రోడ్ల వెంబడి ఫ్లెక్సీల నీడలో, చెట్ల కింద మహిళలు, వృద్ధులు కూర్చున్న పరిస్థితి నెలకొంది. సీఎం రాకముందే సభా ప్రాంగణం నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన వైసీపీ నాయకులు అప్పటికప్పుడు వేదిక సమీపంలో టెంట్లు వేసి మహిళలను కూర్చోబెట్టారు.