టీడీపీ - జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ విజయవంతంతో సీఎం జగన్ చెంచాలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేర్ని నానితో పాటు ఐదుగురు వైసీపీ నేతలు ప్రెస్ మీట్‌లు పెట్టారంటే వారికి ఒంట్లో వణుకు పుట్టినట్లు కాదా? అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్‌కు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఓట్లేయరని అన్నారు. బీసీ మంత్రి, దళిత ఎంపీ అవాకులు, చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. అసలు దళిత ఓట్లు వైసీపీకి పడతాయనే నమ్మకం ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గత ఎన్నికల స్టంట్‌లో భాగంగా గంగలో మునిగి జంధ్యం వేసుకోలేదా అని ప్రశ్నించారు. కుటుంబ సమేతంగానేమో ఏసయ్యను ప్రార్థిస్తారని అన్నారు. దేవుడిపై రాజకీయాలు చేయడం మానాలని చెప్పారు. కల్తీ మద్యం తాగించి జనాల ఆరోగ్యాలను పాడు చేసింది చాలదా అని పిల్లి మాణిక్యరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.