సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. శనివారం ఇద్దరు వైసీపీ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. నెల్లూరులో జరిగే సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పల్నాడు జిల్లా దాచేపల్లిలో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు.