చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులకు స్వర్ణయుగంలా నడి చిందని టీడీపీ నాయకుడు కేశినేని శివనాథ్(చిన్ని), ఆ పార్టీ పొలిట్‌బ్యూరో బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్, వాసవీ ఫౌండేషన్ వ్యవస్థా పకుడు వీవీకే నరసింహరావు, పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మలపెంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్లో సెంట్రల్ నియోజకవర్గ ఆర్యవైశ్య ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లా డారు. తనకు ఆర్యవైశ్యులంటే ఎంతో గౌరవమని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని బొండా ఉమా కోరారు. వెలంపల్లి శ్రీనివాసరావు రాజకీ యాల్లో ఓ చీడపురుగు, బఫూన్, సన్నాసి, తులసి వనంలో గంజాయి మొక్క అని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. పది మంది పోలీసులను వెంట వేసుకుని ఉదయాన్నే కొత్తపిచ్చోడు మాదిరి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాడని, రెండు నెలల టూరిస్ట్ లాగా నియోజకవర్గంలో తిరుగు తున్నాడని అన్నారు. కరోనా సమయంలో అందరూ బాధపడుతుంటే సేవా కార్యక్రమాల పేరుతో రూ.9 కోట్లు, ఆర్యవైశ్యుల వన భోజనాల పేరుతో రూ.5 కోట్లు వెలంపల్లి దండుకున్నాడన్నారు. అతని ఇంట్లో ఏం జరిగినా ఆర్యవైశ్యుల నుంచి భారీగా డబ్బు దండుకుంటున్నాడన్నారు. ఆర్యవైశ్యులు తనకు అండగా ఉండాలని, తాను అండగా ఉంటానని, చంద్రబాబును సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య నాయకుడు కొణిజేటి రమేష్, పేర్ల రవి, బి.శేషుబాబు, పి.మల్లికార్జున్, నూకల నాగేశ్వరరావు, ఎన్.కోటేశ్వ రరావు, వక్కలగడ్డ భాస్కరరావు, నియోజకవర్గంలోని వాసవీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.