‘‘వైసీపీ నేతలు కేశినేని నాని, వెలంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో లంబూజంబూల్లా తిరుగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో నన్ను కబ్జాకోరుగా, గూండాగా చిత్రిం చేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. నాపై చేస్తున్న ఆరోపణలకు వారిద్దరు ఆధారాలు చూపాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాని, వెలం పల్లిపై నేను చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెట్టా. ఆ ఆక్రో శంతోనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీ యంగా తనను దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. పాయకాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం టీడీపీ-జనసేన సెంట్రల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్, వీఎం రంగా విగ్రహాలకు కేశినేని చిన్నితో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.