ప్రజలను ఓట్లు అడిగే అర్హత వైసీపీ నాయకులకు ఏ మాత్రం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లాలోని శిరివెళ్ల గ్రామానికి చెందిన ముల్లా హబీబ్ బాషా, ముల్లా అబ్దుల్ రెహమాన్, ముల్లా అస్సర్ బాషా, షఫి, ముల్లా అక్తర్, ముల్లా మహమ్మద్ గౌస్, షేక్ అబ్దుల్లా, షేక్ కరీం బాషా తదితరులు 50 కుటుంబాలతో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ నాయుడు సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనతో విసిగిపోయిన ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తుంటే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమం కోసం ఆళ్లగడ్డ, శిరివెళ్లలో ఆటో నగర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దోచుకోవడం.. దాచుకోవడమే తెలుసు తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. బీసీ ఖాజా హుసేన్, బీసీ ఫిదా హుసేన్, యామా గుర్రప్ప, సూరా రామ, బీఎండీ రఫీ, అబూబకర్ సిద్ధిఖ్, పీఎండీ ఉస్మాన్, అబ్దుల్ అజీస్, షఫీవుల్లా, పీపీ లింగమయ్య పాల్గొన్నారు.