సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది.
భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దని ECI స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసే వారమని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ECI హెచ్చరించింది.