ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్) ఇంక్రిమెంట్ల అమలుకు నిబంధనలను సడలిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఉద్యోగులకు విద్యార్హతను బట్టి 6, 12, 18, 24, 30 ఏళ్లలో పదోన్నతి రాకపోతే ఏఏఎస్‌కు అర్హులయ్యేవారు. దాంతో విద్యార్హతలు లేని వారికి తీవ్ర నష్టం వాటిల్లేది. ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా ఏఏఎస్‌ను వర్తింపజేస్తారు.