రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్.. చివరికి అమరావతిలో ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని మండిపడ్డారు.