వైసీపీ రాక్షస పాలన నచ్చక రాష్ట్రంలోని ప్రజలు టీడీపీలో చేరుతున్నారని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ ఉమాదేవితోపాటు 50కుటుంబాలు అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో మార్పు మొదలైందని చెప్పారు. టీడీపీ హయాంలో ఏపీ అన్నపూర్ణగా ఉంటే.. ప్రస్తుత వైసీపీ పాలనలో హత్యలకు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa