ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెలను చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఒత్తిడికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
ఏపీకి చంద్రబాబు చేసిన మేలు ఏమీ లేదని, చెత్తపాలన చేశారు కాబట్టే ప్రజలు ఓడించారని మండిపడ్డారు. తనను ఆంబోతు అంటున్న చంద్రబాబు.. ఆయన జీవితం గురించి ఆలోచించుకోవాలని రాంబాబు సూచించారు.