ఎండలు మండిపోతున్నాయి. కాలు బయట పెట్టాలంటే చాలు జనం భయపడిపోతున్నారు. వాతావరణ శాఖ పలు హెచ్చరికలను తెలిపింది. రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని,
నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినట్లు పేర్కొంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.