ఉత్తరప్రదేశ్‌లోని పెళ్లి ఊరేగింపు షాదంగా మారింది. ఓ గ్రామంలో DJ స్పీకర్ ఓవర్‌హెడ్ హై టెన్షన్ వైర్‌తో తగిలి ఇద్దరు అన్నదమ్ములు రవి (20), రాజేష్ (18), డీజే కూలీ సతీష్ (18) అక్కడిక్కడే మృతి చెందారు.
కౌశాంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుహ్నియాపూర్ గ్రామంలో శనివారం రాత్రి పెళ్లి ఊరేగింపులో.. డీజే స్పీకర్లకు హై-ఎక్స్టెన్షన్ వైర్ తగిలి ఈ ప్రమాదం జరిగిందని సర్కిల్ ఆఫీసర్ అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఆయన తెలిపారు.