ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఠక్కమని చెప్పే సమాధానం మౌంట్ ఎవరెస్ట్ అని. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నది చాలా మంది పర్వతారోహకుల కల. ఏటా సుమారు 800 మంది ఎవరెస్ట్‌ను అధిరోహిస్తారు.
అయితే వారిలో అందరూ సజీవులుగా తిరిగిరారని గణాంకాలు చాటుతున్నాయి. అక్కడ ఉండే కఠిన పరిస్థితులే దీనికి కారణం. మృతదేహాలను కిందికి తీసుకురావడం కూడా అసాధ్యం కాబట్టి వాటిని మంచులోనే పాతిపెడతారు. అందుకే దీనిని ఎత్తైన స్మశానవాటికగా పిలుస్తారు.