విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు మహా పాదయాత్ర నిర్వహించాయి. కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు,
రాజకీయ పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు.