కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ‘‘2009లో పంచలూడగొడతానన్నాడు. ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు.
వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు. పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.