ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావాలనే వైసీపీ మూకలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 01:56 PM

తనపై నీచ రాజకీయాలకు సీఎం జగన్ రెడ్డి ఆయన అనుచరులు పాల్పడుతున్నారని టీడీపీ పి.గన్నవరం ఇన్‌చార్జి మహాసేన రాజేష్ అన్నారు. శనివారం నాడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ తనపై కుట్రలు చేస్తున్నారని.. ఇలా అయితే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై వైసీపీ మూకలు కుతంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తనను పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ- జనసేన శ్రేణులను సెంటిమెంటల్ బ్లాక్ మొయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తాను గెలవనని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రాహ్మణ సంఘాలు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని బ్రాహ్మణ సంఘాలు ముట్టడిస్తాయనే విధంగా కొంతమంది వైసీపీ మూకలు పోస్టింగ్‌లు చేయడం తనకు బాధనిపిస్తున్నాయని వాపోయారు. దయచేసి టీడీపీ, జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టవద్దని మహాసేన రాజేష్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com