సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ను సుప్రీం కోర్టు మందలించింది. 'మీరేం సామాన్య పౌరుడు కాదు.
ఓ మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మీకు తెలియదా? రాజ్యాంగం కల్పించిన హక్కులను మీరు దుర్వినియోగం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.