ఏపీలో భూ యాజమాన్య హక్కు చట్టంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాండ్ టైటిలింగ్ చట్టాన్ని తాము ఇప్పుడే అమలు చేయడం లేదని, అందువలన పిటిషనర్‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏజీ చెప్పారు. ప్రజల ఆస్తిహక్కుకు భంగం కలిగించే విధంగా చట్టం ఉందని కోర్ట్‌కు న్యాయవాది యలమంజుల బాలాజీ వివరించారు. అడ్వకేట్ జనరల్ చెప్పిన అంశాన్ని రికార్డ్ చేయాలని బాలాజీ కోరారు. గతంలో తాము ఉత్తర్వులు ఇచ్చామని ఇప్పుడు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు నాలుగు వారాలు సమయం ఇస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.