టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బీసీలకు చేసింది సామాజిక న్యాయం కాదని.. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ధనవంతులనే రాజ్యసభకు పంపుతాడన్నారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి అని పేర్కొన్నారు. ఎన్నికలముందు జయహో బీసీ అంటున్నారని ధర్మాన విమర్శించారు. ఎన్నికలు తర్వాత జయహో బీసీని చింపి అవతల పడేస్తారన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదన్నారు. 5 ఏళ్లలో 1 లక్షా 22 వేల కోట్లు బీసీలకు నేరుగా ఇచ్చామని ధర్మాన తెలిపారు. బీసీలపై చర్చకు తాను సిద్ధమంటూ టీడీపీకి సవాల్ విసిరారు. వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని పెడతామంటే అంగీకరించబోరన్నారు. చంద్రబాబు కపట మాటలు ఎవ్వరూ నమ్మరని ధర్మాన తెలిపారు.