చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సూచనల మేరకు గురువారం అనకాపల్లి జిల్లా కసింకోటలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రివైయస్ జగన్మోహన్ రెడ్డి చేయూత కార్యక్రమానికి చోడవరం నియోజవర్గ నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వెళ్లారు.అక్క చెల్లెమ్మలకు వరుసగానాలుగో విడత చేయూత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో చోడవరం మండలం ముదుర్తి గ్రామం నుంచి కూడా మహిళలు బస్సులో తరలి వెళ్లారు.