బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురానున్నట్లు టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ..
తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదరణ పథకం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందజేస్తామని ప్రకటించారు.