ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన ఆమె..
కాసేపట్లో రాజీనామాపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని గతంలోనే ఆమె సీఎంను కోరారు. జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.