ఏపీలో ఎండల తీవ్రత రోజూరోజుకి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులపై చర్చ మొదలైంది. ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఎస్‌టీయూ డిమాండ్ చేసింది.
విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని, వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 11 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని కోరింది. ఇక తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.