చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని అన్నారు. తనతో కలిసి ప్రయాణం చేస్తానని శ్రీనివాస్ చెప్పినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఓ కుటుంబం చేతిలో బందీగా మారిందని విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని అన్నారు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. జగన్ ముఠా నుంచి రాయలసీమను కాపాడాలన్నారు.